బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో ధనలక్ష్మి బాదర్ల నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వసుదేవసుతం’. మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహించారు. రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సినీ అభిమానులను ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ హీరో సత్య దేవ్ విడుదల చేశారు.
Also Read :Ari: శ్రీకాంత్ అయ్యంగార్ సినిమా పోస్టర్ల తొలగింపు.. దర్శకుడికి బీజేపీ కేంద్ర మంత్రి ప్రశంసలు
‘వసుదేవసుతం’ టీజర్ ఎంతో పవర్ ఫుల్‌గా ప్రారంభమైంది. “ఈ కథ ధర్మానికి అడ్డొస్తే.. మేనమామ అయినా, లక్షల బంధుగణమైనా, ఎదురుగా కోట్ల సాయుధులే ఉన్నా.. ధర్మ హింస తథైవచ అన్న శ్రీ కృష్ణుడిదే కాదు. ధర్మాన్ని కాపాడేందుకు ఎంతటి మారణహోమానికైనా ఎదురెళ్లే ఓ యువకుడిది” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో టీజర్‌ను అద్భుతంగా కట్ చేశారు. హీరో ఎంట్రీ, గుడి, గుప్త నిధిని చూపించినట్టుగా వేసిన షాట్స్, హీరో హీరోయిన్ల ట్రాక్, మరియు హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా, టీజర్ చివర్లో కత్తితో నరికే సీన్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. ఈ టీజర్‌కు మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (RR) నెక్స్ట్ లెవెల్‌లో ఉండి సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. అలాగే, ‘పార్కింగ్’ ఫేమ్ జిజ్జు సన్నీ సినిమాటోగ్రఫీ అద్భుతంగా అనిపిస్తోంది. టీజర్‌లోనే ఇంతటి గ్రాండ్‌నెస్ కనిపిస్తుందంటే, సినిమా ఖచ్చితంగా వేరే స్థాయిలో ఉంటుందని అర్థమవుతోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీ వివరాలను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించనుంది.
