Site icon NTV Telugu

VarunTej : మెగా ఆనంద హేల.. తండ్రి కాబోతున్న వరుణ్ తేజ్

Varuntej Lavanya

Varuntej Lavanya

ప్రేమ పెళ్లి చేసుకున్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందరికి షాక్ ఇచ్చారు. చాలా కాలంగా లవ్‌లో ఉన్నఈ జంట తమ బంధాన్ని సీక్రెట్ గా ఉంచారు. వరుణ్ తేజ్ – లావణ్య మధ్య ఏదో నడుస్తోందని మీడియా కోడై కూసింది. మెగా కాంపౌండ్‌లో లావణ్య త్రిపాఠి ఎక్కుగా కనిపిస్తుండటం.. మెగా – అల్లు కుటుంబాలలో ఏ శుభకార్యం జరిగినా పాల్గొనడంతో ఈ అనుమానాలకు తావిచ్చింది. ఇద్దరూ ఈ గాసిప్స్‌పై మౌనంగానే ఉన్నారు. కానీ మొత్తనికి తమ రిలేషన్‌పై మౌనం వీడిన వరుణ్ – లావణ్య పెద్దల అంగీకారంతో ఒకటయ్యారు.

Also Read : Anasuya : నా భర్తతో ముందే ఒప్పందం కుదుర్చుకున్న ..

ఇక తాజాగా ఈ యంగ్ కపుల్స్ కు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జంట త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు.   ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ తేజ్, లావణ్య   అఫీషియల్ గా ప్రకటించేసారు. ఒక బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసుకొని తాము అతి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా రివీల్ చేశారు. వరుణ్ కూడా ‘జీవితంలో అత్యంత అందమైన పాత్ర పోషించనున్నాను’ అని  క్యాప్షన్ పెట్టేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మొత్తనికి వరుణ్ తండ్రి కాబోతున్నాడు. మెగా ఫ్యామిలి లోకి మరో వారసుడు రాబోతున్నారు. మొన్నటి వరకు వైరల్ అవుతున్న ఈ వార్త కన్ఫర్మ్ అయ్యింది.

Exit mobile version