Site icon NTV Telugu

‘గని’ జులై నుంచి కొత్త షెడ్యూల్​

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న10వ సినిమా ‘గని’. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే ఈ కథతో కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ కథానాయిక నటిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పణలో, రినైస్సాన్స్ – బ్లూ వాటర్ క్రియేటివ్ బ్యానర్‌లో అల్లు బాబీ, సిద్ధు నిర్మిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే 70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్‌ జులై నుంచి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బాక్సింగ్‌ ఆటలో భాగంగా వచ్చే క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ని ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కాగా కరోనా వేవ్ తో ఆగిపోయిన సినిమా షూటింగ్స్ అన్ని కూడా ఈ నెల చివరి వారంలో పునప్రారంభించే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version