Site icon NTV Telugu

Vaayuv Tej : వరుణ్ తేజ్, లావణ్యల కొడుకు పేరు ఏంటో తెలుసా?

Varun Tej

Varun Tej

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య దంపతులు ఈమధ్య ఒక మగ బిడ్డకు తల్లిదండ్రులైన సంగతి తెలిసిందే. దీంతో మెగా కుటుంబానికి వారసుడొచ్చాడంటూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఇక తాజాగా ఆ బుడతడికి తల్లిదండ్రులు నామకరణం చేశారు. మెగా వారసుడికి ‘వాయుయ్వ్ తేజ్’ అంటూ నామకరణం చేసినట్లు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడైన వరుణ్ తేజ్ ముకుందా సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా, లాంచింగ్ కి మాత్రం గట్టిగానే ఉపయోగపడింది.

Also Read:Dussehra : దసరా అసలు రహస్యం..! ఆయుధ పూజ ఎందుకు చేస్తారు..?

తర్వాత కంచె, తొలిప్రేమ, ఫిదా లాంటి సినిమాలతో వరుణ్ తేజ్ హీరోగా టాలీవుడ్‌లో స్థిరపడిపోయాడు. ఇక లావణ్య త్రిపాఠి గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తర్వాత అనేక సినిమాల్లో స్టార్ హీరోలతో సైతం నటించి మంచి గుర్తింపు సంపాదించింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి చేసిన మిస్టర్ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను వీరిద్దరూ పెళ్లి దాకా తీసుకువెళ్లింది.

Exit mobile version