Site icon NTV Telugu

Viraaji: వరుణ్ సందేశ్ హీరోగా “విరాజి”.. శబరి నిర్మాత కొత్త సినిమా

Viraaji

Viraaji

Varun Sandesh Viraaji to release in theatres on August 2nd: ఇటీవల “నింద” మూవీతో మంచి సినిమా చేశాడనిపించుకున్న హీరో వరుణ్ సందేశ్ తన కొత్త సినిమా “విరాజి” తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎమ్ 3 మీడియా బ్యానర్ పై శబరి నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ఆద్యంత్ హర్ష దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. తాజాగా విరాజి సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ వరుణ్ సందేశ్ ను కొత్త అవతారం లో చూపించే చిత్రమిది. ఆగస్టు 2న రిలీజ్ చేయాలని అనుకుంటున్నా, ఈ నెల రోజులు బాగా ప్రమోట్ చేయాలని ప్లాన్ చేశాం అని అన్నారు.

Sonakshi Sinha: పెళ్లై వారం కూడా కాలేదు..మొగుడితో చెప్పులు మోయిస్తోంది!

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ విరాజి కథ చెప్పేందుకు హర్ష నా దగ్గరకు వచ్చాడు. ఫస్టాఫ్ వింటున్నప్పుడు పది నిమిషాల తర్వాత కథ ఇలా ఉంటుందేమో అని రెండు మూడు చోట్ల గెస్ చేశా, సెకండాఫ్ కు వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమా తప్పకుండా చేయాలని ఫిక్స్ అయ్యా. మా డైరెక్టర్ హర్ష కు ఇది మొదటి సినిమా కానీ ఆయన చేయబోయే చాలా సినిమాలకు ఇది మొదటి సినిమా. హర్ష కు లాంగ్ కెరీర్ ఉంటుంది. విరాజి నేను నా 17 ఏళ్ల కెరీర్ లో చేయని ఒక డిఫరెంట్ మూవీ. అలాంటి మోస్ట్ క్రేజియెస్ట్ క్యారెక్టర్ ఇందులో చేశాను. ఈ నెల 10వ తేదీన విరాజి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తాం. మీరు చూడగానే సర్ ప్రైజ్ అవుతారు. ఈ క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు గంట సమయం పట్టేది, నేను విరాజి మూవీ రిలీజ్ కోసం ఎగ్జైటెడ్ గా వెయిట్ చేస్తున్నా అన్నారు.

Exit mobile version