Site icon NTV Telugu

Varun Sandesh : ఆ “హ్యాపీడేస్” గుర్తు వస్తున్నాయి

Happydays

Happydays

వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించిన కానిస్టేబుల్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ “నా కెరీర్ లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం “హ్యాపీడేస్” 2007లో ఇదే నెలలో విడుదలై, ఘన విజయం సాధించి, నా కెరీర్ ని మలుపు తిప్పింది. అందుకే నా జీవితంలో అక్టోబర్ మాసం గుర్తుండి పోయింది.

Also Read:Raviteja: ఇది కదా డెడికేషన్ అంటే.. గాయంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లే ముందు షూట్..

ఇప్పుడు ఈ చిత్రం కూడా ఇదే నెలలో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తు వస్తున్నాయి” అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు. “సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని మలచడం జరిగింది. కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, సందేశం వంటి అంశాలను మిళతం చేసి రూపొందించడం జరిగింది” అని అన్నారు. ఈ వేడుకలో యువ హీరోలు అర్జున్, కార్తీక్ రాజు, విశ్వ కార్తికేయ, ఇంకా సునామీ సుధాకర్, దువ్వాసి మోహన్, కెమెరామెన్ హజరత్, సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్, సహ నిర్మాతలు నికిత జగదీష్, కుపేంద్ర పవర్, ఇతర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version