Site icon NTV Telugu

Varalaxmi Sarathkumar : హాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్

Rizana

Rizana

వరలక్ష్మి శరత్‌కుమార్‌ను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా సినీ రంగంలో ప్రవేశించిన వరలక్ష్మి శరత్‌కుమార్, అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తమిళంతో పాటు తెలుగు, మలయాళం వంటి భాషల్లో భేదం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

Also Read : Kuberaa : 100 కోట్ల ‘కుబేరు’డు!

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆమె హాలీవుడ్‌లో అడుగుపెట్టబోతోంది. బ్రిటిష్ నటుడు జెరెమీ ఐరన్స్ సరసన నటిస్తూ హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోంది. వెటరన్ డైరెక్టర్ చంద్రరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీలంకలో షూట్ చేస్తున్నారు. RIZANA-A Caged Bird పేరుతో రూపొందుతున్న ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక వరలక్ష్మి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, ఇటీవల ఆమె నికోలై అనే వ్యక్తితో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి చెన్నై, ముంబైలలో సమయం గడుపుతూ ఆనందంగా ఉన్నారు.

Exit mobile version