NTV Telugu Site icon

“మెరిసాలె” సాంగ్ రిలీజ్ చేయనున్న తమిళ భామ

Varalakshmi Sarath Kumar to launch the Merisaley lyrical song from Ardha Shathabdham

కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ జంటగా నవీన్ చంద్ర, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘అర్ధశతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్లపై వీర్ ధర్మిక్ సమర్పణలో రూపొందుతోంది. చిట్టి కిరణ్, రామోజు, తేలు రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నౌపాల్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన “‘ఏ కన్నులూ చూడనీ” సాంగ్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. లవ్ అండ్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఇటీవలే విడుదలైంది. ట్రైలర్ కు కూడా మంచి స్పందనే వస్తోంది. కాగా ‘ఆహా’లో జూన్ 11న ఈ చిత్రం ప్రసారం కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో అప్డేట్ ను ప్రకటించారు మేకర్స్. అందులో జూన్ 5న 12 గంటల 15 నిమిషాలకు తమిళ భామ వరలక్ష్మి శరత్ కుమార్ చేతుల మీదుగా “మెరిసాలె” అనే లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను కూడా వదిలారు.