NTV Telugu Site icon

విజయ్ కోసం వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామా… !

Vamshi Paidipally an emotional action drama for Vijay

దళపతి విజయ్, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. తెలుగులో విజయ్ కు ఇదే మొదటి స్ట్రయిట్ చిత్రం. ఇటీవలే వంశీ పైడిపల్లి తన స్టోరీని విజయ్ కు వివరించి, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి వంశీ స్క్రిప్ట్ రాస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం విజయ్ కోసం వంశీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాను రాస్తున్నట్లుగా తెలుస్తోంది. కథలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ రేంజ్ లో నిర్మించే అవకాశం ఉంది. దిల్ రాజు తన యూఎస్ పర్యటన నుంచి తిరిగి వచ్చాక వంశీ స్క్రిప్ట్ ను వింటారు. ఇక ప్రస్తుతం విజయ్ తన 65వ చిత్రంపై దృష్టి పెట్టారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పూర్తయ్యాక వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతారు విజయ్.