Site icon NTV Telugu

Ustad-bhagat-singh: ఉస్తాద్ భగత్ సింగ్ ఆల్బమ్ రెడీ – ఫస్ట్ సింగిల్ కౌంట్‌డౌన్ స్టార్ట్!

Usthad Baghadh Sing

Usthad Baghadh Sing

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు కొత్త అప్‌డేట్‌తో హీట్ పెంచేసింది. దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కలయిక అంటే ప్రేక్షకుల్లో ఎప్పుడూ స్పెషల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. పవన్ ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో బిజీగా ఉన్నా, షూటింగ్ కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తున్నాడట. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీ లీల, రాశి ఖన్నా ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెండు విభిన్నమైన పాత్రలతో ఇద్దరి కెమిస్ట్రీ స్క్రీన్‌పై హైలైట్ కానుందని టాక్. ఇక ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్, పవన్ డైలాగ్స్, పంచ్‌లు పవర్‌స్టార్ అభిమానులను థియేటర్‌లో పిచ్చెక్కించేలా ఉండబోతున్నాయని యూనిట్ సమాచారం. అయితే

Also Read : Chandini Chowdary : సైన్స్ ఫిక్షన్ టచ్‌తో.. సూపర్ హీరో కథతో వస్తున్న చాందినీ చౌదరి

తాజాగా ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ గురించి పెద్ద అప్‌డేట్ బయటకు వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సంగీతం ఇప్పటికే ఫైనల్ అయిపోయిందట. మొత్తం నాలుగు సాంగ్స్ ఫిక్స్ చేశారు. అయితే ప్రతి పాటకు ప్రత్యేకమైన థీమ్ ఉండబోతోందట. ఒక పాట మాస్ పబ్లిక్ సాంగ్‌గా, మరోటి లవ్ మెలొడీగా, ఒకటి పవన్ ఎంట్రీ సాంగ్‌గా, చివరిది భావోద్వేగ సాంగ్‌గా రూపుదిద్దుకుంటోందని మ్యూజిక్ వర్గాల టాక్. డీఎస్పీ – పవన్ కలయిక అంటే ఎప్పుడూ మ్యూజిక్ లవర్స్ కి ట్రీట్ లాంటిదే. గబ్బర్ సింగ్, జల్సా లాంటి సినిమాలకు ఆయన అందించిన మ్యూజిక్ ఇప్పటికీ హిట్స్ లిస్ట్‌లో నిలిచేలా ఉంది. ఇక ఈసారి ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి డీఎస్పీ కొత్త బీట్‌లు, పవన్ ఎనర్జీకి సరిపోయేలా ప్రత్యేక రిథమ్‌తో పని చేశారట. కాగా ఇక ఫస్ట్ సింగిల్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సమాచారం ప్రకారం నవంబర్ చివర్లో లేదా డిసెంబర్ మొదట్లో ఆ పాటను రిలీజ్ చేసే అవకాశం ఉందట. మొత్తానికి, ఉస్తాద్ భగత్ సింగ్ మ్యూజిక్ అప్‌డేట్‌తో పవర్‌స్టార్ ఫ్యాన్స్‌లో మళ్లీ హై వోల్టేజ్ ఎనర్జీ వచ్చేసింది.

Exit mobile version