NTV Telugu Site icon

Urvashi Rautela: మరో బంపర్ ఆఫర్ కొట్టెసిన ఊర్వశి రౌతేలా !

February 7 2025 02 24t103615.128

February 7 2025 02 24t103615.128

సౌత్‌లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ఊర్వశి రౌతేలా. ఇప్పటి వరకు ‘వాల్తేరు వీరయ్య’, ‘బ్రో’ చిత్రాల్లో ఊర్వశి ఐటెం సాంగ్స్ చేయగా, తాజాగా బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ ‘డాకు మహారాజ్’ చిత్రంలో దబిడి దిబిడి ఐటెం సాంగ్ తో మరింత పాపులారిటి దక్కించుకుంది. ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది.. ముఖ్యంగా ఈ మూవీలో పాట మాత్రమే కాకుండా పోలీస్ గా ఆమె పాత్రలో గ్లామర్ తో పాటు యాక్షన్ కూడా బాగానే హైలైట్ అయింది. దీంతో ప్రస్తుతం ఊర్వశి దృష్టి మొత్తం సౌత్ ఇండస్ట్రీ మీద ఉంది. అయితే తాజాగా ఈ హాట్ బ్యూటీ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది..

Also Read: Ritu Varma: ముద్దు విషయంలో నాకు హద్దులు లేవు : రీతూ వర్మ

స్టార్ దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కలయికలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. ఈ పీరియాడిక్‌ మాస్‌ యాక్షన్‌ డ్రామాలో తారక్‌కు జోడీగా రుక్మిణీ వసంత్‌ నటించబోతుంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న తొలి షెడ్యూల్‌లో తారక్‌ లేని సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారట. మార్చ్ నెల నుండి ఎన్టీఆర్ ఈ మూవీ సెట్స్‌లో జాయిన్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఓల్డ్‌ కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సెట్‌ను ఏర్పాటు చేశారు, కాగా ఈ సెట్ లోనే ఈ సినిమా రెండో షెడ్యూల్‌ స్టార్ట్ కాబోతుందట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో ఊర్వశి రౌతేలా ఛాన్స్ కొట్టేసిందట. అంతేకాదు వచ్చే షెడ్యూల్ లో ఊర్వశి రౌతేలా కూడా షూట్‌లో జాయిన్ కానుందట.. ఈ వార్త గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.