ఇండస్ట్రీలో కొన్ని కలయికలను అసలు ఎవరూ ఊహించలేం. అలాంటి కలయికల్లో ఒకటి సుహాస్, కీర్తి సురేష్ . వీరిద్దరి కాంబోలో ‘ఉప్పు కప్పురంబు’ అనే సినిమా తేరకెక్కిన్న సంగతి తెలిసిందే. అని. ఐ. వి శశి దర్శకత్వంలో ఈ సినిమాకు వసంత్ మరళీ కృష్ణ కథ అందించగా, ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రై. లి బ్యానర్ పై రాధికా లావు నిర్మిస్తున్నారు. 90ల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో సెటైర్, కామెడీతో పాటూ ఓ సామాజిక సమస్య గురించి కూడా ప్రస్తావించినట్టు మేకర్స్ తెలిపారు. ఈ సినిమా ఆహ్లాదకరంగా, సెటైరికల్ గా ఉంటూనే ఆడియన్స్ ను ఎంతో ఆలోచింపచేసేదిగా ఉండనుందట.
Also Read : Peddi : ‘పెద్ది’ నుంచి స్పెషల్ పోస్టర్..
కాగా ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఓటీటీ రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్ .. ‘ఉప్పు కప్పురంబు’ సినిమా జులై 4 నుంచి ప్రపంచ వ్యాప్తంగా 240కు పైగా దేశాల్లో ప్రైమ్ వీడియోలో స్పెషల్ గా ప్రీమియర్ కానున్నట్టు తెలిపారు. తెలుగులో రిలీజ్ కానున్న ఈ సినిమా తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో డబ్బింగ్ తో అందుబాటులోకి రానుంది. అయితే ఇప్పటికే టీజర్ ఆకట్టుకోగా..
తాజాగా ఈ మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. కాగా ట్రైలర్ గనుక పరిశీలిస్తే.. ఊరీ స్మశానంలో ఇంకా కేవలం నలుగురికి మాత్రమో చోటు ఉంటుంది. ఉరి పెద్దగా అధికారంలోకి వచ్చిన కీర్తి సురేష్ దాని ఎలా సాల్వ్ చేసింది? అనేది స్టోరి. కాగా విలేజ్ డ్రాప్ లో పూర్తి ఎంటర్ ట్రైనింగ్ మూవీ గా వస్తున్న ఈ మూవీలో కీర్తి లుక్ మొత్తం మార్చేసింది. చాలా రోజులకు బాబుమోహాన్ మంచి కం బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుహాస్ కూడా మంచి కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. టోటల్ గా ట్రైలర్ మాత్రం కాస్త కన్ఫ్యూజన్ గాను ఇటు ఎంటర్టైనింగ్ గాను ఆకట్టుకుంది.