Site icon NTV Telugu

Coolie: ‘కూలీ’తో కయ్యానికి సై అంటున్న కన్నడ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

Untitled Design (1)

Untitled Design (1)

సూపర్ స్టార్ రజినీ కాంత్ జైలర్ సినిమా హిట్ తో వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. జై భీమ్ వంటి సందేశాత్మక సినిమాను తెరకెక్కించిన దర్శకుడు టీ.జే జ్ఞానవేల్ దర్శకత్వంలో వెట్టయాన్ లో నటిస్తుండగానే విక్రమ్ తో కమల్ హాసన్ కు అల్ టైమ్ హిట్టు అందించిన యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు తలైవా సూవర్ స్టార్ రజనీ కాంత్.

Also Read: RAM : హరీష్ శంకర్ – రామ్ పోతినేని సినిమా ఉంటుందా.. ఉండదా..?

ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వైజాగ్ లో జరుగుతుంది. 40 రోజుల పాటు వైజాగ్ లో షూటింగ్ చేసేలా లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసింది యూనిట్. తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే న్యూస్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో రజనీకాంత్ ప్రతికథానాయకుడిగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కనిపించబోతున్నడని సమాచారం. త్వరలోనే ఉపేంద్ర ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని న్యూస్ వైరల్ గా మారింది . రజనీ కమల్ మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని, లోకేష్ హై యాక్షన్ కు ఉపేంద్ర స్టైల్ కలగలిపి ఆడియెన్స్ కు ఫీస్ట్ లా ఉండబోతుందని తమిళ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ లో సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిచనుండగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల విడుదలైన కూలీ టైటిల్ గ్లిమ్స్ కు విపరీతమైన స్పందన లభించింది. ప్రస్తుతం ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో UI అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Exit mobile version