Site icon NTV Telugu

ఉపాసన సోదరి నిశ్చితార్థం!

మెగాపవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన సోదరి అనుష్పాల కి నిశ్చితార్థం పూర్తి అయింది. త్వరలోనే తను ప్రేమించిన అథ్లెట్‌ అర్మన్‌ ఇబ్రహీంతో త్వరలోనే ఏడడుగులు వేయనుంది. ఈ క్రమంలో అతడితో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది అనుష్పాల. అటు ఉపాసన కూడా ఇదే ఫొటోను తిరిగి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ అంటూ రింగ్ సింబల్ ను జోడించింది. కాగా కాజల్‌, తమన్నా, లక్ష్మీ మంచు, ఛార్మీ, అల్లు స్నేహా, శ్రియా భూపాల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి పలువురు సెలబ్రిటీలు ఈ జంటకు అభినందనలు తెలిపారు.

ఉపాసన కామినేని కూడా రామ్ చరణ్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఉపాస‌న ప‌ర్స‌న‌ల్ విష‌యాలతో పాటు ప్రొఫెష‌న‌ల్ విష‌యాలు షేర్ చేస్తూ ఉంటుంది. యంగ్ ఎంటర్‌ప్రెన్యూయర్‌గా సత్తా చాటుతూ అపోలో లైఫ్ విభాగం వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న ఉపాసన.. నిత్యం సామాజిక కార్య‌క్ర‌మాలు కూడా చేపడుతుంది.

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

Exit mobile version