Site icon NTV Telugu

Raju Srivastava: నిలకడగా కమెడియన్‌ శ్రీవాస్తవ ఆరోగ్యం.. సహాయం అందిస్తామన్న యూపీ సీఎం

Raju Srivastava

Raju Srivastava

ఇటీవలె జిమ్‌ చేస్తూ గుండెపోటు రావడంతో అస్వతస్థతకు గురై ఆసుప్రతిలో చేరిన కమెడియన్ రాజు శ్రీవాస్తవ ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని కుటుంబ సభ్యుల తెలిపారు. యాంజియోప్లాస్టీ చికిత్స విజయవంతం అయిందని ఆయన ఆరోగ్యంగా వున్నారని పేర్కొన్నారు. ఆయన ఇంకా అస్వతస్థతలోనే వున్నారని, చాలా సీరియస్‌ గా వుందని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆ వార్తనలు నమ్మకండని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పరిస్థతి బాగుండాలని త్వరగా కోలుకోవాలని మీరందరు కోరుకున్న విధంగా రాజు శ్రీవాస్తవ కోలుకుంటున్నారని, వైద్యులు ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారని దయచేసి పుకార్లను నమ్మవద్దని కోరారు.

రాజు శ్రీవాస్తవ గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరడంతో..యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగస్టు 11న రాజు శ్రీవాస్తవ భార్యకు ఫోన్ చేసి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాడు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్న ప్రముఖ హాస్యనటుడి కుటుంబానికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

ఆగస్టు 10 బుధవారం జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న సమయంలో రాజు శ్రీవాస్తవకు గుండెపోటు వచ్చింది. ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్ చేస్తున్న సమయంలో ఛాతీలో నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. అతని శిక్షకుడు అతనికి రెండుసార్లు సీపీఆర్‌ చేసి ఆనంతరం ఎయిమ్స్ ఢిల్లీకి తరలించినట్లు శ్రీవాస్తవ పీఆర్‌ అజిత్‌ సక్సేనా తెలిపారు.

Exit mobile version