NTV Telugu Site icon

UnstoppableS4 : పుష్పరాజ్ తో అఖండ ‘అన్ స్టాపబుల్ ఫైర్’

Unstoppables4

Unstoppables4

అన్‌స్టాపబుల్ సీజన్ 4 మిలియన్ వ్యూస్ తో దూసుకెళుతోంది. హోస్ట్ గా బాలయ్య షోను ముందుండి నడిపిస్తున్నారు. ఈ సీజన్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్స్ గాను ఏపీ సీఎం చంద్రబాబు, మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య అన్‌స్టాపబుల్ సెట్స్ లో సందడి చేసి వెళ్లారు. ఈ మూడు ఎపిసోడ్స్ అటు వ్యూస్ పరంగాను రికార్డు స్థాయిలో రాబట్టాయి. ఇక తాజాగా నాలుగవ ఎపిసోడ్ ప్రమోను రిలీజ్ చేసారు అహ మేకర్స్.

ఈ ఎపిసోడ్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. బన్నీ నటిస్తున్న ‘పుష్ప ది రూల్‌’ ప్రమోషన్స్‌లో భాగంగా అల్లు అర్జున్‌  అన్‌స్టాపబుల్ సెట్స్ లో సందడి చేశారు.ఈ సందర్భంగా పలు ఆసక్తికర విశేషాలు హోస్ట్ బాలయ్యతో పంచుకున్నాడు బన్నీ. అందులో భాగంగా జాతీయ అవార్డు రావడం పట్ల ఎలా అనిపించింది అని ప్రశ్నిచారు బాలయ్య. అందుకు బదులుగా బన్నీ సమాధానం ఇస్తూ తెలుగులో ఒక్కరికి కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు రాకపోవడం తనని బాధించిందని. దాన్ని రౌడంప్ చేసి పెట్టుకుని ఎలాగైనా సాధించాలనుకున్నాను ఫైనల్ గా సాధించాను అని తెలిపారు. చిరంజీవి, మహేశ్‌బాబుతోపాటు పలువురు టాలీవుడ్ నటీనటులతో ఉన్న అనుబంధాన్ని అన్‌స్టాపబుల్ పై నుండి గుర్తు చేసుకున్నాడు బన్నీ.  ఈ  స్పెషల్ ఎపిసోడ్ లో బన్నీ అమ్మ అల్లు  నిర్మల కూడా పాల్గొని పలు విశేషాలు పంచుకున్నారు. కాగా నవంబర్‌ 15న ఈ ఎపిసోడ్‌ పార్ట్‌ 1 ప్రసారం కానుంది.

Also Read : Actress Kasturi : పరారీలో నటి కస్తూరి.. పోలీసుల గాలింపు 

Show comments