Unstoppable with NBK: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మొదలైన ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ సీజన్ 2 కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. పొలిటికల్ అండ్ ఫ్యామిలీకి సంబంధించి ఆసక్తికరమైన ప్రశ్నలు సంధించి, చంద్రబాబు, లోకేశ్ నుండి జవాబుల్ని రప్పించిన బాలకృష్ణ తాజా ఎపిసోడ్ కు యంగ్ హీరోస్ ను ఆహ్వానించారు. హీరో కమ్ రైటర్ సిద్ధు జొన్నలగడ్డతో పాటు హీరో కమ్ డైరెక్టర్ విశ్వక్ సేన్ ఈ ఎపిసోడ్ కు హాజరయ్యారు. వారిద్దరితో పాటు ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ జత అయ్యాడు. ఈ సెకండ్ ఎపిసోడ్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
గాడ్ ఆఫ్ మాస్ ఎన్బీకే!
సిద్ధు, విశ్వక్ సేన్ లను పరిచయం చేసే క్రమంలో బాలకృష్ణ… ఒకరు మాస్ కా దాస్ అయితే మరొకరు మాస్ కా బాస్ అని… అయితే తాను వాటిని మించిన గాడ్ ఆఫ్ మాస్ అని చెప్పారు. ఫుల్ ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ తో ఈ ఎపిసోడ్ సాగిందని తాజాగా విడుదలైన ప్రోమోను చూస్తే అర్థమౌతోంది. సిద్ధు జొన్నలగడ్డ హెయిర్ స్టైల్ చూసి తలదువ్వుకోకుండా వచ్చేశాడని బాలకృష్ణ వ్యాఖ్యానించగానే, ‘సార్ ఇది మెస్సీ లుక్’ అంటూ సిద్ధు జవాబు చెప్పాడు. ‘ఆ లుక్ తో నేను కనిపించిన సినిమాలన్నీ మెస్ అయ్యాయి’ అంటూ బాలకృష్ణ తన మీద తానే సెటైర్ వేసుకున్నారు. వాళ్ళిద్దరికీ ఉన్న మందు అలవాటును గుర్తు చేస్తూ, ‘మరి ఒకసారి కూర్చుందామా?’ అని బాలకృష్ణ అడగడం వాళ్ళు… ‘బాటిల్ తోనే కాదా’ అని చెప్పడం… ఆ వెనుకే బాలకృష్ణ ‘పైసావసూల్’ మూవీ కోసం పాడిన ‘అరె మామా ఒక పెగ్ లా…’ పాట ఆడియో రావడం ఫన్నీగా ఉంది. ఇక ‘మీ కరెంట్ క్రష్ ఎవరు’ అని సిద్దు అడిగిన ప్రశ్నకు మరో ఆలోచన లేకుండా బాలకృష్ణ ‘రశ్మికా మందన్న’ పేరు చెప్పారు.
ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన నిర్మాత సూర్యదేవర నాగవంశీతో ‘భీమ్లానాయక్’ ఫస్ట్ ఛాయిస్ ఎవరు? అని బాలయ్య బాబు ప్రశ్నించడం విశేషం. అప్పట్లో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ సమయంలో బాలకృష్ణ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. మరి ఈ ప్రశ్నలకు నాగవంశీ ఏం సమాధానం చెప్పాడో తెలుసుకోవాలంటే… ఈ నెల 21 వరకూ వెయిట్ చేయాల్సిందే!
https://www.youtube.com/watch?v=ubnNaWRJjwM
