NTV Telugu Site icon

Unstoppable : బాలయ్య బాబు – వెంకీ మామ – అనిల్ రావిపూడి..

Unstoppables4

Unstoppables4

అన్‌స్టాపబుల్ సీజన్ 4 సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ వేదికపై మలయాళం హీరో దుల్కర్ సల్మాన్, తమిళ స్టార్ హీరో సూర్య సందడి చేసారు. అలాగే ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీతో సహా విచ్చేసి ఎన్నో విషయాలు బాలయ్యతో పంచుకున్నారు. బన్ని ఎపిసోడ్ మిలియన్ వ్యూస్ తో రికార్డు సాధించింది. ఇక లేటెస్ట్ గా యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి, డాన్సింగ్ డాల్ శ్రీలీల అన్ స్టాపబుల్ సెట్స్ లో నవ్వులు పువ్వులు పూయించారు.

Also Read : UiTheMovie : ‘యుఐ’ క్లైమాక్స్ చూసి షాక్ అవుతారు : ఉపేంద్ర

ఇక నెక్ట్స్ ఎపిసోడ్ లో మరో స్టార్ హీరో పాల్గొనబోతున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్స్ లో న్యూస్ గట్టిగా వినిపిస్తుంది. ఆయన మరెవరో కాదు సీనియర్ నటుడు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం వెంకీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రచారంలో భాగంగా వెంకీ అన్ స్టాపబుల్ సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. వెంకీ తో పాటు చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ ఎపిసోడ్ లో బాలయ్య తో కలిసి సంక్రాంతికి వస్తున్నాం విశేషాలు పంచుకోబోతున్నారట. ఈ ఎపిసోడ్ ను ఈ  నెల 22న షూట్ చేయబోతున్నారట మేకర్స్. బాలయ్య – వెంకీ ఒకే వేదికపై కనిపించి చాలా కాలం అవుతున్న నేపథ్యంలో అన్ స్టాపబుల్ సెట్స్ లో వీరి హంగామా ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అటు ఫ్యాన్స్ లోను ఇటు ప్రేక్షకుల్లోనూ నెలకొంది.

Show comments