Site icon NTV Telugu

Bapuji Konda Laxman : కొండా లక్ష్మణ్ బాపూజీపై డాక్యుమెంట్రీ ఫిల్మ్ విడుదల

Unity

Unity

తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చి గల్లీ నుంచి డిల్లీ వరకు పోరాటం చేసి తెలంగాణ బాపూజీగా గుర్తింపు తెచ్చుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీపై బడుగు విజయ్ కుమార్ దర్శకత్వంలో చిరందాసు ధనుంజయ నిర్మించిన యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్ ను ప్రఖ్యాత గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 27 కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకొని ప్రముఖ రచయిత మసన చెన్నప్ప తో కలిసి అశోక్ తేజ యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్ ను విడుదల చేశారు.

Also Read:OG: ఓజీలో టైం ట్రావెల్.. చూసినోళ్లు ఇది అబ్జర్వ్ చేశారా బాసూ?

ఈ సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న అశోక్ తేజ…. బాపూజీ జీవన ప్రవాహాన్ని ఎంతో భావోద్వేగంగా చిత్రీకరించిన దర్శక నిర్మాతలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యూనిటీ డాక్యుమెంట్రీ ఫిల్మ్ ను విడుదల చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్న సుద్దాల అశోక్ తేజ…. తెలంగాణ ధ్వజస్తంభాలను భావితరాలు గుర్తుంచుకునేలా యూనిటీ చిత్రం ఉందన్నారు. ఇటీవల 15వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ల్లో ఉత్తమ దర్శకుడి విభాగంలో పురస్కారం రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రేక్షకులంతా ఉచితంగా యూట్యూబ్ లో యూనిటీ చిత్రా్నని తప్పకుండా చూడాలని అశోక్ తేజ విజ్ఞప్తి చేశారు. ఈ చిత్రంలో మాస్టర్ భాను, మైమ్ మధు కీలక పాత్రల్లో నటించారు.

Exit mobile version