Site icon NTV Telugu

Udugula Venu: సాయిపల్లవి ఫోటోను ట్వీట్ చేసిన డైరెక్టర్‌.. ట్రెండింగ్‌ లో పోస్ట్‌

Binalu Saipallavi

Binalu Saipallavi

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఏటా రాష్ట్రంలో జరిగే లాల్‌ దర్వాజ బోనాలు ఆడపడుచుకులు అందంగా ముస్తాబై బోనంతో ఊరేగింపుగా బయలు దేరి అమ్మవారికి సమర్పించుకుని మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బోనాల ఉత్సవాల ఫ్లేవర్‌ను సినిమాల్లో చూపించేందుకు దర్శకులు రెడీగా ఉంటారు. అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించిన బోనాలకు సంబంధించిన సన్నివేశాలు, పాటలు ఓరేంజ్‌ లో హైలెట్‌ అయి దూసుకుపోతున్నాయి. ఈనేపథ్యంలో రీసెంట్‌ గా రిలీజ్‌ అయిన సినిమా రానా, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన విరాటపర్వం.

read also: Karnataka: ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు దుర్మరణం

ఈ చిత్రంలో డైరెక్టర్‌ వేణు ఊడుగల బోనాల సన్నివేశాలతో తెలంగాణ ముఖ చిత్రాన్ని కండ్లకు కట్టినట్లుగా చూపించారు. ఆసన్ని వేశాలు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే ఈ చిత్రంలో ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌ పోషించిన సాయిపల్లవి లంగా వోణిలో తెలుగుతనం ఉట్టిపడేలా బోనం ఎత్తుకొన్ని వచ్చే సన్నివేశాలు చాలా అందంగా అందరిని ఆకట్టుకున్నాయి. కాగా.. నేడు భాగ్యనగరంలో బోనాల సందడి ఉండటంతో.. విరాటపర్వం సినిమాలోని ఓఫోటోను షేర్ చేస్తూ.. అంద‌రికీ #Happybonam అనే హ్యాష్‌ట్యాగ్‌తో డైరెక్టర్‌ వేణు ఊడుగుల‌ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. తెలంగాణ గ్రామీణ జీవన సంస్కృతికి, ప్రకృతికి, పర్వావరణానికి తెలంగాణ ఆడబిడ్డలు తీర్చుకునే మొక్కు బోనాల పండుగ ఇది.. తెలంగాణ ప్రజల అస్తిత్వ పతాక.. అంటూ ట్విట్‌ చేసారు వేణు. ఇప్పడు ఈ ట్విట్‌ నెట్టింట్లో ట్రెండింగ్‌ అవుతోంది. లంగావోనీలో సాయిపల్లవి బోనమెత్తుకుని వస్తున్న ఫోటోను చూసి అందరూ ఫిదా అవుతున్నారు.

Exit mobile version