Site icon NTV Telugu

“ఆర్టికల్ 15” రీమేక్ లో యంగ్ ఎమ్మెల్యే…!

Udhayanidhi Stalin to resume shooting of Article 15 remake soon?

కోలీవుడ్ స్టార్ హీరో ఉదయనిధి స్టాలిన్ నిర్మాత నుంచి హీరోగా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ హీరో “సైకో” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో గుడ్డివాడి పాత్ర పోషించాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తమిళనాడులో ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్ గా తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో చెపౌక్-ట్రిప్లికేన్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాగా ఈ యంగ్ ఎమ్మెల్యే త్వరలోనే మరో మూవీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

Read Also : “బంగార్రాజు” కోసం బేబమ్మ ?

డైరెక్టర్ అరుణరాజా కామరాజ్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం “ఆర్టికల్ 15” తమిళంలో రీమేక్ కాబోతోంది. ఇందులో స్టాలిన్ హీరోగా కనిపించనున్నారు. రాజకీయాల్లో చురుకుగా ఉన్న ఉదయనిధి మళ్ళీ సినిమాల్లో నటించడానికి కొంత సమయం కేటాయించబోతున్నాడు. “ఆర్టికల్ 15” తమిళ రీమేక్ చిత్రీకరణను ఆగస్టు చివరి నాటికి తిరిగి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ రీమేక్‌లో శివానీ రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు మాగిజ్ తిరుమేనితో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నారు ఉదయనిధి. ఇది గత ఏడాది నవంబర్‌లో సెట్స్ పైకి వెళ్ళింది.

Exit mobile version