NTV Telugu Site icon

Saif Ali Khan : సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్.

Saif

Saif

బాలీవుడ్‌ ఖాన్ హీరోలలో ఒకరైన సైఫ్ అలీఖాన్‌ ఇంట్లోకి చొరబడి పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. గత గురువారం ఉదయం 2.30 గంటలకు సైఫ్ ఇంట్లోకి చొరబడిన అగంతకుడు దొంగతనానికి యత్నించాడు. అది గమనించిన సైఫ్ అలీఖాన్ దొంగను పట్టుకునేందుకు ప్రయత్నించగా సైఫ్ పై ఆరుచోట్ల కత్తితో దాడి చేసాడు. ఈ ఘటనలో సైఫ్‌ కు సుమారు 6 కత్తి పోట్లు దిగినట్టు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం సైఫ్ ను ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Also Read : Venky Atluri : కోలీవుడ్ స్టార్ హీరోతో వెంకీ అట్లూరి సినిమా.?

సైఫ్ శరీరంలో విరిగిన కత్తి మొనను వైద్యులు తొలగించారు. ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మరోవైపు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసు నిందితుడు అరెస్ట్‌ చేసారు. నిందితుడిని ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌లో అరెస్టు చేసిన రైల్వే పోలీసులు. జ్ఞానేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా అరెస్ట్‌ చేసారు రైల్వే పోలీసులు. నిందితుడి కోసం ఛత్తీస్‌గఢ్‌ బయల్దేరిన ముంబై పోలీసులు సైఫ్‌ అలీఖాన్‌పై దాడి కేసులో ఇద్దరు నిందితులను నిన్న దుర్గ్‌లో ఆకాష్ కనోజియాను అదుపులోకి తీసుకున్నారు ముంబై పోలీసులు. ఇవాళ మరో నిందితుడు మహ్మద్ షరిఫుల్ ఇస్లామ్ అరెస్ట్ చేసారు. రెండవ నిందితుడు మహ్మద్‌ను సైఫ్‌ నివాసానికి 35 కిమీ దూరంలోని హీరానందానీ ఎస్టేట్‌లో పట్టుకున్న నేడు పట్టుకున్నారు ముంబై పోలీసులు. కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించనున్నారు పోలిసులు. ఉద్దేశపూర్వకంగా ఈ దాడి చేసారా లేక ఎవరైనా ఈ దాడి చేపించారా ఇలా రకరకాల కోణాల్లో విచారిస్తున్నారు