Site icon NTV Telugu

ట్రెండింగ్ లో “బాయ్ కాట్ తూఫాన్” !

Twitterati boycotts Farhan Akhtar's 'Toofan' first look over his comment on CAA

బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ “తూఫాన్”. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయనతో పాటు రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత పర్హాన్, రాకేశ్ ఓంప్రకాశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తుఫాన్’పై భారీ అంచనాలే ఉన్నాయి. ముంబైలోని స్లమ్ ప్రాంతం డోంగ్రీ లో పుట్టి పెరిగిన ఓ అనాథ… బాక్సింగ్ ఛాంపియన్ గా ఎలా తయారయ్యాడన్నదే ఈ చిత్ర కథ. పరేశ్ రావేల్ తో పాటు మృణాల్ ఠాకూర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో ఫర్హాన్ బాక్సింగ్ రింగ్ లో బ్లూ కలర్ షర్ట్ తో, గ్లౌజులతో కన్పించాడు. అయితే ఈ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి “బాయ్ కాట్ తూఫాన్” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు.

Read Also : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నమిత

అందుకు కారణం పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), ప్రతిపాదిత నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సి)పై కొనసాగుతున్న నిరసనలపై ఆయన చేసిన కామెంట్స్. అంతకుముందు ఆయన అభిమానులుగా ఉన్నవారు కేసుల మాకు నీ సినిమాకన్నా దేశం ముఖ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే సినిమాలోని పాత్రలను ఉదహరిస్తూ ఈ హీరో ఇప్పుడు లవ్ జిహాద్ ను కూడా ప్రమోట్ చేస్తున్నాడని, బాలీవుడ్ హిందువులను టార్గెట్ చేస్తోందని ఆరోపిస్తున్నారు. కానీ బాలీవుడ్ అయినా, ఏ హీరోలైనా, లేదా ఓటిటి ప్లేట్ ఫామ్ లైనా… హిందువులను టార్గెట్ చేస్తే సహించేది లేదంటూ మంది పడుతున్నారు. ఇక సుశాంత్ అభిమానులైతే సుశాంత్ లేనప్పుడు బాలీవుడ్ ఎందుకు ? బాలీవుడ్ ను బ్యాన్ చేస్తున్నామని అంటున్నారు. మరి ఈ ఎఫెక్ట్ సినిమాపై ఎంతలా పడుతుందో చూడాలి.

Exit mobile version