NTV Telugu Site icon

Guruprasad: దర్శకుడు ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. రక్త వాంతులు?

Gurup

Gurup

కన్నడ సినిమా ప్రత్యేక దర్శకుడు గురుప్రసాద్ మదనాయకనహళ్లిలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆత్మహత్యకు ముందు రక్తపు వాంతులు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరణానికి ముందు జరిగిన సంఘటనతో భారీ ట్విస్ట్ వెలుగులోకి వచ్చిందని అంటున్నారు. గురుప్రసాద్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ ఎంతో విలువైన దర్శకుడిని కోల్పోయిందని చాలా మంది నటీనటులు, దర్శకులు, నిర్మాతలు బాధను పంచుకున్నారు. మూడు నాలుగు రోజుల క్రితం గురుప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడగా, మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వచ్చే స్థాయికి చేరుకుంది. పోలీసులు అపార్ట్ మెంట్ ఇంటి తలుపులు పగులగొట్టి భార్య సుమిత్ర సమక్షంలో మృతదేహాన్ని పరిశీలించారు. పోలీసులు గురుప్రసాద్ మృతదేహాన్ని పరిశీలించగా రక్తపు వాంతులు చేసుకున్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో పోలీసులు మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు.

Guruprasad: అప్పులబాధతో స్టార్ డైరెక్టర్ సూసైడ్.. ఇండస్ట్రీలో తీవ్ర విషాదం

గురుప్రసాద్ మద్యంలో విషం కలుపుకుని తాగి ఉరి వేసుకుని చనిపోయే అవకాశం ఉందని అంటున్నారు. శరీరంలో విషం ఇంకా పనిచేస్తుండడంతో నొప్పి కారణంగా రక్తాన్ని వాంతులు చేసుకుని ఉండవచ్చు. అనంతరం నొప్పి భరించలేక ఉరివేసుకుని ఉండవచ్చని అంటున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను అన్వేషించేందుకు ప్రాథమిక సమాచారం సేకరిస్తున్నారు. దీంతో ప్రస్తుతానికి గురుప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ను సీజ్ చేశారు. న్యూ హెవెన్ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ని మదనాయకనహళ్లి పోలీసులు సీజ్ చేశారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గుర్తించడంతో ఫ్లాట్‌ను సీజ్ చేసి ఎవరినీ లోపలికి రానివ్వకుండా సాక్ష్యాల కోసం వెతికారు. వాంతులు కావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. ఉరి వేసుకున్న మూడు, నాలుగు రోజులకే గురుప్రసాద్ మృతదేహం కుళ్లిపోవడం ప్రారంభమైంది. కుళ్లిపోవడంతో శరీరం నుంచి ద్రవం లీక్ అయి ఉండవచ్చని కూడా చెబుతున్నారు. అయితే ఇది ఆత్మహత్యగా తేలినా విషం తాగాడా? లేదా? అన్నది పోస్టుమార్టం తర్వాత తేలనుంది.

Show comments