ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘టుక్ టుక్’. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు మేకర్స్. మంగళవారం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
ఈ సందర్భంగా శాన్వీ మేఘన మాట్లాడుతూ ” పుష్పక విమానం తర్వాత నేను చేసిన ఆటో ఎంటర్‌టైనర్ టుక్ టుక్. టీజర్ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ సినిమాలో సూపర్ నేచురల్, మ్యాజికల్ పవర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ సినిమాలో ఉన్న చాలా సర్‌ఫ్రైజెస్ ఎంజాయ్ చేయడానికి అందరూ ఈ సినిమాను థియేటర్‌లో చూడాలి” అన్నారు. రోషన్ మాట్లాడుతూ ”టీజర్ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ముగ్గురు యువకుల ప్రయాణం. వాళ్ల జీవితంలో వచ్చిన మ్యాజికల్ ఎలిమెంట్స్‌ను ఎలా ఫేస్ చేశాడో ఈ సినిమా చూసి తెలుసుకోవాలి. తప్పకుండా ఈ సినిమా అందరి హృదయాలకు హత్తుకుంటుందనే నమ్మకం ఉంది’ అన్నారు.