NTV Telugu Site icon

ఓటిటిలో విజయ్ సేతుపతి ‘తుగ్లక్ దర్బార్’

Tuglaq Darbar Movie to get OTT Release

సౌత్ పాపులర్ హీరో, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం ‘తుగ్లక్ దర్బార్’. ఢిల్లీ ప్రసాద్ దీనదయాళ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లలిత్ కుమార్ నిర్మిస్తున్నారు. గోవింద్ వసంత్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో రాధాకృష్ణన్ పార్డీబన్, రాశి ఖన్నా, మంజిమా మోహన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయిది తాజా సమాచారం ప్రకారం ‘తుగ్లక్ దర్బార్’ చిత్రం ఓటిటిలో విడుదల కాబోతోంది. కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ‘తుగ్లక్ దర్బార్’ను థియేటర్లో విడుదల చేసి అభిమానుల జీవితాలను పణంగా పెట్టడం సరైన చర్య కాదని భావిస్తున్నారట మేకర్స్. ఈ చిత్రం ఓటిటి విడుదల ద్వారా దక్షిణాది ప్రేక్షకులందరికీ ఇంటి దగ్గరే చూసే అవకాశం ఉంటుంది. ఈమేరకు ఓటిటి రిలీజ్ కోసం ‘తుగ్లక్ దర్బార్’ చిత్ర బృందం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ‘తుగ్లక్ దర్బార్’ విడుదల తేదీని డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రకటిస్తారు.