Site icon NTV Telugu

మహేశ్ తర్వాత ఎన్టీఆర్ కాదు పవన్

Trivikram to team up with Pawan Kalyan for his next movie

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ తో ప్రకటించిన ‘అయినను పోయిరావలె హస్తినకు’ ప్రాజెక్ట్ ఆగిపోయిన విషయం తెలిసందే. దీంతో ఎన్టీఆర్ కొరటాలతో… త్రివిక్రమ్ మహేశ్ తో తమ తమ ప్రాజెక్టులను సెట్ చేసుకున్నారు. త్రివిక్రమ్-మహేశ్ సినిమా మే 31న హీరో కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆరంభం కానుంది. 2022 సమ్మర్ లో విడుదల కానుంది. ఇక మహేశ్ సినిమా తర్వాత త్రివిక్రమ్ జూనియర్ తో సినిమా చేస్తాడని అందరూ అనుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ పవర్ స్టార్ తో జోడీ కట్టబోతున్నాడట. వీరిద్దరి కలయికలో ఇప్పటికే ‘జల్సా, అత్తారింటికి దారేది’ వంటి హిట్స్… ‘అజ్ఞాతవాసి’ వంటి డిజాస్టర్స్ వచ్చి ఉన్నాయి. ఇప్పుడు నాలుగోసారి వీరి కలయికలో సినిమా రానుందన్నమాట. 2022లో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడుతుందంటున్నారు. మరి ‘అరవింద సమేత’ వంటి హిట్ తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఎప్పుడు మొదలవుతుందనేది ప్రస్తుతానికి సస్సెన్స్.

Exit mobile version