ప్రస్తుతం హీరో హీరోయిన్ లో కొందరిని చూస్తే వారి వయసు పెరుగుతుందా? తరుగుతుందా అర్థం కావడం లేదు . అందులో చెన్నై కుట్టి త్రిష ఒకరు. ఈ ముద్దుగుమ్మకు 41 ఏళ్ల వయసంటే ఎవరూ నమ్మరు. ఈ వయసులోనూ చెక్కు చెదరని గ్లామర్‌తో పాటు సౌత్‌లో నెంబర్‌వన్ హీరోయిన్‌గా వెలుగొందుతున్నారు త్రిష. 1999లో వెండితెరపై ఎంట్రీ ఇచ్చి ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో తెలుగు వారిని పలకరించిన త్రిష.. వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, స్టాలిన్, సైనికుడు, కృష్ణ, కింగ్, తీన్మార్, దమ్ము.. తదితర చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. 25 ఏళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ తదితర భాషల్లో అందరు అగ్రహీరోల సరసన నటించారు. ఇక ఒక దశలో ఆమె కెరీర్ ముగిసినట్లేనని అంతా అనుకున్నారు.
Also Read : Upendra: అనారోగ్యం పై.. స్పష్టతనిచ్చిన ఉపేంద్ర
కానీ ప్రజంట్ సెకండ్ ఇన్నింగ్ లో కూడా ఊహించని విధంగా దూసుకుపోతుంది. ఒకప్పుడు నటించిన స్టార్ హీరోలందరితో మళ్లీ సినిమాలు చేస్తోంది. చిరంజీవి, కమల్ హాసన్, అజిత్, విజయ్.. ఇలా స్టార్స్ అందరితో మళ్లీ నటిస్తున్న త్రిష. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా కెరీర్ ప్రారంభంలో తన మానసిక స్థితిని బయటపెట్టింది త్రిష.. ‘అందాల పోటీల్లో పాల్గొంటున్న సమయంలో, యాడ్స్ కూడా చేసేదాని. ఈ సమయంలో నాకు ఒక సినిమా ఛాన్స్ వచ్చింది. అయితే అగ్రిమెంట్‌లో సంతకం పెట్టే ముందు, సినిమా సరిగ్గా ఆడకపోతే నను ఏమీ అనకూడదు, సినిమాలు వదిలేసి చదువుకుంటానని అమ్మ ముందు కండిషన్ పెట్టాను. ఆ కండిషన్ కు అమ్మ అంగీకరించిన తర్వాతే అగ్రిమెంట్ పై సంతకం చేశాను. ఒకవేళ మొదటి సినిమా సరిగ్గా ఆడకపోతే ఈపాటికి సైకాలజిస్ట్ అయ్యేదాన్ని’ అని చెప్పుకొచ్చింది బ్యూటీ త్రిష.
