NTV Telugu Site icon

వ్యాపారవేత్తను పెళ్లాడబోతున్న త్రిష ?

Trisha Krishnan to Marry a Business Man Soon ?

త్రిష కృష్ణన్ దక్షిణాదిన స్టార్ గా దశాబ్ద కాలం పాటు కొనసాగిన హీరోయిన్లలో ఒకరు. ఎన్నో చిత్రాల్లో నటించిన తన నటనా ప్రతిభతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఒకప్పుడు తెలుగు, తమిళ భాషలలో వరుస చిత్రాలతో టాప్ హీరోయిన్‌గా ఉన్న త్రిషకు ఇప్పుడు చాలావరకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అయితే తాజాగా త్రిష పెళ్ళి బంధంలోకి అడుగు పెట్టబోతోంది అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. తమిళ మీడియా వర్గాల సమాచారం ప్రకారం ఈ 37 ఏళ్ల నటి త్వరలోనే ఓ వ్యాపారవేత్తను వివాహం చేసుకోబోతోందట. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే త్రిష వైపునుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. చాలాకాలం నుంచి త్రిష పెళ్ళికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. ఇక ఈ చెన్నైచంద్రం గతంలో వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో పెళ్ళి వరకూ వెళ్లి వెనక్కి తగ్గిన విషయం తెలిసిందే. త్రిష, వరుణ్ మణియన్‌ కు నిశ్చితార్థం జరిగింది. కానీ పెళ్లి మాత్రం క్యాన్సిల్ అయ్యింది.