Site icon NTV Telugu

Tripti Dimri : త్రిప్తి దిమ్రీ బోల్డ్ స్టేట్మెంట్ !

Tripti Dimri’

Tripti Dimri’

బాలీవుడ్‌లో ఈ మధ్య బాగా వినిపిస్తోన్న పేరు త్రిప్తి దిమ్రీ. ‘లిల్లీ’, ‘బుల్బుల్’, ‘కళ’ వంటి విభిన్న కథా చిత్రాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన త్రిప్తి, ‘యానిమల్’ సినిమాలో తన గ్లామర్, పెర్ఫార్మెన్స్‌తో యువతను ఊపేశింది. ఈ సినిమా ద్వారా నటి త్రిప్తి దిమ్రి ఎంతో ఫేమస్ అయ్యారు. ఇప్పటివరకు బాలీవుడ్ సినిమాలలో నటించిన రాని గుర్తింపు ఆమెకు యానిమల్ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత త్రిప్తి వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్నారు. ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ తో కలిసిన నటించే ఛాన్స్ కూడా ఈమె దక్కించుకున్నారు. తాజాగా సిద్ధాంత్‌ చతుర్వేదితో కలిసి నటించిన ప్రేమకథా చిత్రం ‘ధడక్ 2’ ఆగస్టు 1న విడుదలకు సిద్ధమవుతోంది.

Also Read : Ramayana: రాముడిగా సల్మాన్ ఖాన్.. 40 శాతం షూటింగ్ ఫినిష్ కానీ..

ఈ సందర్భంగా త్రిప్తి తన కెరీర్ విషయాల్లో ఓ బోల్డ్ స్టేట్మెంట్ చేసింది. ఇప్పటివరకు ప్రేమకథలు, కామెడీ పాత్రలు మాత్రమే చేసిన తానొక యాక్షన్ పాత్ర చేయాలని ఆసక్తిగా ఉందని వెల్లడించింది. ‘‘యాక్షన్ పాత్రల్లో భావోద్వేగాన్ని శరీరం ద్వారా వ్యక్తపరచాలి. అలాంటి పాత్రలు చేసే అవకాశాల కోసం ఎదురుచూస్తున్నా’’ అంటూ చెప్పింది. అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలకైనా తాను రెడీ అని, ఇప్పటివరకు అవి విలన్లుగా పరిగణించేవారు కానీ ఇప్పుడు అవి నటన పరంగా ఓ పెద్ద ఛాలెంజ్‌గా మారాయని పేర్కొంది. ‘ధడక్ 2’ చిత్రానికి మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉందని తెలిపిన త్రిప్తి..‘ఇందులో కాలేజీ విద్యార్థినిగా నటించాను, తరగతి గదిలో షూటింగ్ చేసినప్పుడు నా కళాశాల రోజులు గుర్తొచ్చాయి. నా సహనటుడు సిద్ధాంత్‌ చతుర్వేదితో మంచి స్నేహం ఏర్పడినందువల్ల షూటింగ్ మొత్తం ఎంతో సరదాగా సాగింది’ అని తెలిపింది.

Exit mobile version