‘యానిమల్’ సినిమాతో కేవలం కొన్ని నిమిషాల స్క్రీన్ టైమ్‌లోనే భారీగా హైప్ తెచ్చుకున్న హీరోయిన్ ట్రిప్తి దిమ్రీ. ఒకే ఒక్క పాటతో బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. రణబీర్ కపూర్‌తో ఘాటైన రొమాంటిక్ సీన్లలో మెరిసిన ఈ బ్యూటీ, ఒక్క సినిమాతోనే ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటూ, ట్రిప్తి వరుసగా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు కొట్టేసింది.
Also Read : Kamal Haasan : ‘ఇండియన్ 3’ రూమర్లకి చెక్ పెట్టిన శంకర్..!
ఇందులో అగ్ర హీరో ప్రభాస్ సరసన ‘స్పిరిట్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన సంగతి అందరికీ తెలిసిందే. దీపికా పదుకొనే తప్పుకున్న తర్వాత ట్రిప్తిని తీసుకున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ఇక తాజాగా ట్రిప్తి, హృతిక్ రోషన్‌తో కలిసి కనిపించనుందంటూ వార్తలు హీటెక్కించాయి. మొదటగా ఇది ‘క్రిష్ 4’ సినిమాలో జోడీగా నటిస్తున్నారన్న ఊహాగానాలు వచ్చినా, నిజానికి ఇది హృతిక్ సొంత బ్రాండ్ ‘HRX’ కోసం రూపొందించిన, ప్రకటన మాత్రమేనని స్పష్టమైంది. హృతిక్ – ట్రిప్తి కలయికలో వచ్చిన ఈ యాడ్ వీడియోలో ఇద్దరూ సూపర్ స్టైలిష్‌గా కనిపించగా, ఫిట్‌నెస్-లైఫ్‌స్టైల్ ప్రొడక్ట్‌లను ప్రోమోట్ చేశారు.
ప్రస్తుతం ఆమె సిద్ధాంత్ చతుర్వేది సరసన ‘ధడక్ 2’ అనే రొమాంటిక్ డ్రామా లో నటిస్తోంది. షాజియా ఇక్బాల్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 1న విడుదల కానుంది. అలాగే షాహిద్ కపూర్‌తో కలిసి నటిస్తున్న ‘అర్జున్ ఉస్తారా’ చిత్రంలో కూడా నటిస్తోంది. ఇక ట్రిప్తి దిమ్రీ ఇలా ఏకకాలంలో ప్రభాస్, షాహిద్, హృతిక్ లాంటి స్టార్ హీరోల ప్రాజెక్టుల్లో భాగం కావడం ఆమె స్టార్ స్థాయి ఎలా మారిందో తెలియజేస్తోంది. ఇకపై ఆమె కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.
