స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదల నిర్మించిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ మూవీలో సత్య రాజ్, ఉదయభాను, వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రముఖ పాత్రలను పోషించారు. ఈ సినిమా ఆగస్ట్ 29న ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్‌లు ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ మేరకు నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ‘త్రిబాణధారి బార్బరిక్’ ప్రయాణం మొదలైంది. నేను నా వ్యాపారాలతో బిజీగా ఉండేవాడిని. ఓ సారి ఈ కథను విన్నాను. మోహన్ గారు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ముందుగా చిన్న బడ్జెట్‌తో మూవీని తీయాలని అనుకున్నాం. ఆ తరువాత మారుతి గారిని కలిశాను. తీస్తే సినిమా బాగా తీయండి.. లేదంటే లేదు అని ఆయన అన్నారు. దీంతో భారీ ఎత్తున ఈ మూవీని తీయాలని ఫిక్స్ అయ్యాను. ‘త్రిబాణధారి బార్బరిక్’ కొత్త రకమైన కథ. చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. మలయాళంలో తీసినట్టుగా చాలా సహజంగా తీశాం.
Also Read : Nara Rohith: నేనూ పవన్ లాగే.. పాలిటిక్స్ పై నారా రోహిత్ షాకింగ్ కామెంట్స్
తెలుగు ఆడియెన్స్‌కు కావాల్సిన కమర్షియల్ అంశాల్ని కూడా జోడించాం. ముందుగా ఈ కథను చిన్న స్థాయిలో తీయాలని అనుకున్నా కూడా కథ డిమాండ్ మేరకు భారీగా నిర్మించాం. ఈ కథను మైథలాజికల్ జానర్‌ను యాడ్ చేసి చెప్పడమే కొత్తగా ఉంటుంది. వరంగల్, విజయవాడలో ప్రీమియర్లు వేశాం. అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమాను చూసిన వారిలో చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు. మూవీ అద్భుతంగా ఉందని అందరూ పొగిడారు. మాకు అదే చాలా సంతృప్తినిచ్చింది. ఆడియెన్స్ ప్రస్తుతం కొత్త కంటెంట్, డిఫరెంట్ కాన్సెప్ట్‌లనే ఆదరిస్తున్నారు. నేను ఈ ఇండస్ట్రీకి కొత్త. మాకు మారుతి గారు అండగా నిలిచారు. కథతో పాటు టెక్నికల్ పరంగానూ చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో ఇన్ ఫ్యూజన్ బ్యాండ్‌ను తీసుకొచ్చాం. వారు ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ అద్భుతంగా వచ్చింది. కెమెరామెన్ కుశేందర్ రమేష్ రెడ్డి గారి విజువల్స్ వర్క్ అందరినీ ఆకట్టుకుంటుంది. మైత్రి వాళ్లు నైజాంలో మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వార్ 2, కూలీ ఆడుతున్నాయి కదా? భారీ సంఖ్యలో థియేటర్లు మనకు కావాలి కాబట్టి ఇప్పుడు వద్దులే అని ఆగస్ట్ 22 కాకుండ ఆగస్ట్ 29కి రిలీజ్ చేద్దామని వాళ్లు సలహాలు ఇచ్చారు. ఇక ఇప్పుడు మాకు కావాల్సినన్ని థియేటర్లు లభించాయి. దీంతో భారీ ఎత్తున మా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం.ది.
