ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోన్న ‘ట్రాన్స్ ఫార్మర్స్’లో మరో సీక్వెల్ అనౌన్స్ అయింది. పెద్ద తెరపై ఏడో ‘ట్రాన్స్ ఫార్మర్స్’ చిత్రం విడుదల కానుంది. లెటెస్ట్ ఇన్ స్టాల్మెంట్ కి ‘ట్రాన్స్ ఫార్మర్స్ : రైజ్ ఆఫ్ ద బీస్ట్స్’ టైటిల్ ని ఖారారు చేశారు. న్యూయార్క్, పెరు లాంటి లొకేషన్స్ లో షూటింగ్ ఉంటుందని కూడా డైరెక్టర్ స్టీవెన్ క్యాపెల్ జూనియర్ తెలిపాడు. ఆయన వివరణ ప్రకారం… ‘ట్రాన్స్ ఫార్మర్స్ : రైజ్ ఆఫ్ ద బీస్ట్స్’ చరిత్రకి అందని కాలం నాటి పురాతన క్రూర జంతువుల కథ. అవి టైం అండ్ స్పేస్ ని దాటుకుని నేటి కాలంలోకి, మన భూమ్మీదకి వస్తాయి. ఆ తరువాత జరిగిన ఒళ్లు గగుర్పొడిచే కథా, కథనమే ‘ట్రాన్స్ ఫార్మర్స్ 7’!
‘ట్రాన్స్ ఫార్మర్స్ 7’… అతి పురాతన అత్యంత క్రూర జంతువులు తరలి వస్తున్నాయి!
