Toxic: రాకింగ్ స్టార్ యశ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను ఎదుర్కొంటున్నట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా యశ్‌కు బలమైన మార్కెట్ ఉన్న సొంత రాష్ట్రం కర్ణాటకలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలకు సొంత రాష్ట్రంలో మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి. సినిమా టాక్ ఎలా ఉన్నా.. హీరోకు ఉన్న క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ కారణంగా తొలి వారంలోనే భారీ వసూళ్లు నమోదవుతుంటాయి. అయితే ‘టాక్సిక్’ విషయంలో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
యశ్ హోమ్ స్టేట్ అయిన కర్ణాటకలో ఈ సినిమా కనీసం రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను కూడా చేరుకోలేకపోయిందనే వార్తలు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. యశ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ మార్క్‌ను ‘టాక్సిక్’ సులభంగా అందుకుంటుందని చాలామంది అంచనా వేశారు. కానీ మొదటి రోజు మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. రెండో రోజు నుంచే గణనీయమైన డ్రాప్‌ను చూసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ అనుకున్న స్థాయిలో లేకపోవడం సినిమా థియేట్రికల్ రన్‌పై ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో కర్ణాటకలో రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌ను అందుకోవాలనే టార్గెట్‌ను ‘టాక్సిక్’ చేరుకోలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది.
అయితే ఈ చిత్రానికి హిందీ మార్కెట్‌లో మాత్రం సినిమాకు కొంత ఊరట లభించినట్లు తెలుస్తోంది. కన్నడ వెర్షన్‌తో పోలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లోని హిందీ బెల్ట్‌లో ‘టాక్సిక్’కు మెరుగైన స్పందన వచ్చినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అక్కడి నుంచి వస్తున్న వసూళ్లు సినిమాకు కొంత బలాన్నిస్తున్నాయని చెబుతున్నారు. ఇక తెలుగులోనూ ‘టాక్సిక్’కు తొలి రోజు సాలిడ్ ఓపెనింగ్ వచ్చినప్పటికీ.. రెండో రోజు నుంచి పరిస్థితి మారిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో షోలు క్యాన్సిల్ అయ్యే పరిస్థితి కూడా ఎదురైనట్లు సమాచారం. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిందని, బయ్యర్లకు నష్టాలు మిగిల్చిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా యశ్‌కు ఉన్న భారీ క్రేజ్, సినిమాపై ఉన్న అంచనాలతో పోలిస్తే ‘టాక్సిక్’ బాక్సాఫీస్ ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగలేదనే చర్చ ట్రేడ్ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా సొంత రాష్ట్రం కర్ణాటకలోనే రూ.100 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోలేకపోవడం ఈ సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

