Site icon NTV Telugu

Tourist Family : ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Turest Family

Turest Family

ప్రస్తుతం కోలీవుడ్‌లో ఓ సెన్సేషన్‌గా మారిపోయిన చిత్రం ‘టూరిస్ట్ ఫ్యామిలీ’. శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో న‌టించ‌గా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేశ్‌ జగన్ తదిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్రల్లో న‌టించారు. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం, మే 1న చిన్న చిత్రంగా ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసి ప‌లువురు సెల‌బ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. ఇప్పటికే రజినీకాంత్, రాజమౌళి, సూర్య, నాని వంటి వారు కూడా ఈ మూవీపై ప్రశంసలు కురిపించగా.

Also Read : Jailer2 : రజనీకాంత్‌కి విలన్‌గా నాగార్జున?.. ఇదెక్కడి మాస్‌రా మామ

సూర్య అయితే టీంను పిలిపించుకుని మరీ అభినందించాడు. అలా టూరిస్ట్ ఫ్యామిలీ అయితే ఇటు ఆడియెన్స్‌ని, అటు సెలెబ్రిటీలను ఆకట్టుకుంది. ఇప్పటికే రూ.75 కోట్లకు పైగానే కలెక్షన్‌లు రాబట్టగా.. మొదటి సినిమాతోనే డైరెక్టర్ అభిషాన్ ఈ రేంజ్ విక్టరీ సాధించడం అంటే చిన్న విషయం కాదు. అయితే తాజాగా ఈ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జియో హాట్ స్టార్ వారు సొంతం చేసుకోగా, ఈ జూన్ 2 నుంచి సినిమా అందుబాటులోకి వస్తుంది అని రివీల్ చేశారు. అయితే ఈ చిత్రం తమిళ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ కావచ్చని తెలుస్తోంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే కేవలం తమిళ్ లోనే రిలీజ్ అవ్వడం తో, తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Exit mobile version