Site icon NTV Telugu

సీఎం రిలీఫ్ ఫండ్ కు స్టార్ ప్రొడ్యూసర్ భారీ విరాళం

Top Producer Kalaippuli S Thanu contributed a DD of Rs. 10 Lakhs to the chief minister public relief fund

కరోనా సెకండ్ వేవ్ తీవ్రతకు దేశం మొత్తం వణికిపోయింది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి మళ్ళీ లాక్ డౌన్ శరణ్యం అయ్యింది. కరోనా వల్ల ప్రజలు ఇబ్బందులకు గురి కావడమే కాకుండా… నష్టం కూడా భారీగానే వాటిల్లింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు కోలీవుడ్ స్టార్స్ అంతా ఏకమయ్యారు. తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు భారీ విరాళాలు అందించిన విషయం తెలిసిందే. తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను 10 లక్షల రూపాయల చెక్కును సీఎం సహాయ నిధికి అందజేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ను కలిసి ఈ చెక్కును అందించారు కలైపులి. ఇక ఇప్పటికే రజినీకాంత్, అజిత్, సూర్య, కార్తి, జయంరవి, విజయ్ సేతుపతి తదితరులు విరాళాలు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు కరోనా కేసులు తగ్గుతుండడంతో సినిమా షూటింగులను తిరిగి ప్రారంభించడానికి సినిమా పరిశ్రమ సిద్ధమవుతోంది. థియేటర్లు కూడా త్వరలోనే తెరుచుకునే అవకాశం ఉంది.

Exit mobile version