Site icon NTV Telugu

ఆల్ టైమ్ రికార్డు సెట్ చేసిన అల్లు అర్జున్

Tollywood's First and Fastest 60M+ views with 1.4M+ Likes for Introducing Pushpa Raj

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తుండగా… రశ్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా సందడి చేయనున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంగా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’కు దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’ పేరుతో హీరో ఇంట్రడక్షన్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. అప్పుడు మొదలైన ‘పుష్ప’రాజ్ జోరు ఇంకా తగ్గనే లేదు. విడుదలైన దగ్గర నుంచి ఈ వీడియో వరుసగా రికార్డులు బద్దలు కొడుతోంది. ఈ వీడియో విడుదలైన 20 రోజుల్లోనే 50 మిలియన్ వ్యూస్ సాధించి టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో 50 మిలియన్ సాధించిన ఇంట్రో వీడియోగా రికార్డ్ సృష్టించింది. తాజాగా ఈ వీడియో ఆల్ టైం రికార్డును సెట్ చేసింది. టాలీవుడ్ లోనే 60+ మిలియన్ల వ్యూస్, 1.4+ మిలియన్ల లైక్స్ సాధించిన మొట్టమొదటి, ఫాస్టెస్ట్ టీజర్ గా నిలిచింది ‘ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పరాజ్’. మరి ‘తగ్గేదే లే’ అంటూ అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఆల్ టైం రికార్డును ఏ హీరో బ్రేక్ చేస్తాడో చూడాలి.

Exit mobile version