NTV Telugu Site icon

Tollywood : మంత్రి కొండా సురేఖకు టాలీవుడ్ నటీనటుల వార్నింగ్..

Tollywood

Tollywood

తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల పట్ల టాలీవుడ్ అక్కినేని కుటుంబానికి మద్దతు ప్రకటిస్తూ, సదరు మంత్రి గారికి చురకలు అంటించారు.  బాద్యతాయుతమైన పదవిలో ఉంటూ కాస్తా తోటి మహిళ పట్ల గౌరవంగా మాట్లాడాలని తమదైన శైలిలో జవాబు ఇచ్చారు. టాలీవుడ్ నటినటులు ఎవరెవరు ఏమన్నారంటే..

దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల : రంగస్థలం సినిమా కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశా 365 డేస్ ప్రతిరోజు సమంత మేడం ని దెగ్గరగా చుసిన ఒక అభిమాని గ చెప్తున్నా. సమంత మేడం Telugu సినిమా ఇండస్ట్రీ దొరికిన వరం. ఒక ఆర్టిస్ట్ గానే కాదు , ఒక వ్యక్తి గా కూడా తను మా ఇంట్లో అక్కల అనిపించేవారు.నాకు సురేఖ గారి గురించి కానీ, సమంత మేడం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. కానీ సురేఖ గారు మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదు. బతుకమ్మ అంటేనే ఆడది అంటారు అలాంటి బతుకమ్మ జరుగుతున్న ఈ టైం లో ఇలాంటి ఇష్యూ రావడం చాల ఇబ్బందిగా అనిపించింది

నటి ఖుష్బూ : ‘‘రెండు నిమిషాల ఫేమ్ కోసం కనీస విలువలు లేని వారు మాత్రమే ఇలా దిగజారి మాట్లాడతారు. కొండా సురేఖ గారు.. మీలో కొన్ని విలువలు ఎక్కడికి పోయాయి? గౌరవప్రదమైన పదవిలో ఉన్న నేతలు సినీ పరిశ్రమలోని నటీనటులపై ఇలా నిరాధారమైన, భయంకరమైన మాటలు మాట్లాడకూడదు. ఇలాంటి ఆరోపణలు చేసినందుకు కొండా సురేఖ క్షమాపణలు చెప్పాల్సిందే. భారతదేశంలో ప్రజాస్వామ్యం వన్‌ వే ట్రాఫిక్‌ కాదు.. మేము మీలాగా మీ స్థాయిలో దిగజారి మాట్లాడలేము.

సినీ రచయిత అబ్బూరి రవి: ‘‘శుద్ధి చెయ్యాల్సింది మూసి నదిని కాదు. రాజకీయ నాయకుల బుద్ధిని. ఛీ.. మరి ఇంత నీచమా.

మంచు లక్ష్మి : ప్రతి సారి రాజకీయ నేతలు తమ అటెన్షన్ కోసం నటీనటులను బస్సు చక్రాల కింద తోసేస్తారు, ఇలా దిగజారి మాట్లాడడం చాలా బాధాకరం. రాష్ట్రంలో దారుణమైన విషయాలు జరుగుతుంటే, నటులను తమతో నిలబడాలని, రాజకీయ ప్రతిపాదనను ఆశిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయంగా ఉంది? అద్దాల మేడలో ఉంటామని సైలెంట్ గా ఉంటామని ఎందుకు అనుకుంటున్నారు. ఒక మహిళ మంత్రి సాటి మహిళను ఇలా అనడం దారుణం. తమ జీవితాలను సినిమాకు అంకితం చేసే వారి పట్ల కొంత గౌరవం ఉంచండి, మీ రాజకీయ ఆటల కోసం ఉపయోగించకండి.. ఇది నా మనసును బాధిస్తుంది, ఇది అన్యాయం .