రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా డబుల్ ఇస్మార్ట్. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా కు సెన్సార్ టీమ్ నుండి మంచి టాక్ అందుకుంది.ఈ సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ ఒకటి ఉందట. బేసిక్ గా టాలీవుడ్ బెస్ట్ ట్విస్ట్స్ లో పోకిరి క్లైమాక్స్ లోని కృష్ణమనోహర్ ట్విస్ట్ ముందువరుసలో లో ఉంటుంది. మరి పూరి జగన్నాధ్ ఇందులో అలాంటి బ్లాస్ట్ అయ్యే ట్విస్ట్ ప్లాన్ చేశారని టాక్ వినిపిస్తోంది.
Also Read : NagaChaitanya: నిశ్చితార్థం వేళ అక్కినేని అభిమానులకు మరో గుడ్ న్యూస్..?
నిహారిక నిర్మాతగా వ్యవహరిస్తున్న చిన్న సినిమా కమిటీ కుర్రోళ్లు. 11 మంది నూతన నటీనటులతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఆగస్టు 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ రోజు ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని చోట్ల పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని భావించారు రైట్స్ కొనుగోలు చేసిన వంశీ నందిపాటి. కానీ నైజాం లాంటి ముఖ్యమైన ఏరియాలో మాత్రం ఒక్క షో కూడా వేయలేదు కమిటీ కుర్రోళ్ళు మేకర్స్ కారణాలు ఏంటో తెలియల్సి ఉంది.
ఆగస్టు 15న విడుదల కానున్న సినిమాలలో రమూడు భారీ సినిమాలు మధ్య రిలీజ్ అవుతోంది ఆయ్. నార్నె నితిన్ హీరోగా గీతా ఆర్ట్స్ -2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించాడు, ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా నేడు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మొత్తం 2:21 గంటల నిడివితో రానుంది ఈ సినిమా. త్వరలోనే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.