టాలీవుడ్ లో హిట్ ఇస్తే ఒకలా ఫ్లాప్ ఇస్తే ఒకలా ఉంటుంది వ్యవ్యహారం. వరుస హిట్లు ఇచ్చి ఒక్క ఫ్లాప్ ఇస్తే తరువాత సినిమా దర్శకత్వం అవకాశం ఇచ్చేందుకు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు హీరోలు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ లు తీసిన పూరి జగన్నాధ్ ఒకే ఒక ఫ్లాప్ సినిమాతో కథ మొత్తం మారిపోయింది. పూరి విజయ్ దేవరకొండ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా ఈ దర్శకుడి తాజా చిత్రం డబుల్ ఇస్మార్ట్ కు తలనొప్పిగా మారింది.
Also Read: Re-Release: మెగా బ్రదర్స్ వస్తున్నారు.. ఇక బాక్సాఫీస్ రికార్డ్స్ గల్లంతే..
లైగర్ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించాడు. పాన్ ఇండియా భాషలలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇండస్ట్రీ డిజాస్టర్ లలో ఒకటిగా మిగిలింది. ఈ సినిమాను నైజాంలో పంపిణి చేసిన బయ్యర్లు తీవ్రంగా నష్టపోవడం, నష్టపరిహారం చెల్లిస్తానని పూరి లెటర్స్ ఇవ్వడం అప్పట్లో జరిగింది. దీంతో ఆ బయ్యర్స్ డబుల్ ఇస్మార్ట్ ను తమకే ఇవ్వాలని పంచాయతీ పెట్టారు. లేదంటే నైజాం లో ఈ సినిమాను బాయ్ కాట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఈ సినిమా పంచాయతీ ఒక కొలిక్కి వచ్చింది. లైగర్ ఎగ్ఙిబిటర్లకు నలభై శాతం నష్టాలు భర్తీ చేయడానికి నిర్మాతలు పూరి, ఛార్మి ఒప్పుకోవడంతో సమస్య తీరింది. నైజాం వ్యవహారం ఎటూతేలక పోవడంతో డబుల్ ఇస్మార్ట్ కు రిలీజ్ ఇబ్బంది అవుతుందేమోనని రామ్ ఫ్యాన్స్ టెన్షన్ పెట్టుకున్నారు. ఇక ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాకు లైగర్ కష్టాలు తీరిపోయినట్లే. మరోవైపు ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కానుంది పూరి జగన్నాధ్, రామ్ పోతినేనిల డబుల్ ఇస్మార్ట్.