నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు యదు వంశీ దర్శకుడు. 11 మంది నూతన నటులు ఈ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయం కట్టబోతున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ చిత్రం ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. పలువులు టాలీవుడ్ సెలెబ్రిటీలతో వినూత్నంగా పబ్లిసిటీ చేస్తూ సినిమాపై మరింత క్రేజ్ పెరిగేలా చేస్తున్నారు.
Also Read :Wayanad: రాజంటే ప్రభాసే.. కేరళకు కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన ‘కర్ణ’..
తాజాగా కమిటీ కురోళ్ళు మరో డేరింగ్ స్టెప్ వేయబోతున్నారు. ఈ రోజు ఈ సినిమాకు టాలీవుడ్ లోని ప్రముఖులకు సెలబ్రిటీ షో వేసే ప్లాన్ లో ఉన్నారు నిర్మాతలు. ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను గురువారం సెలెక్టెడ్ ఏరియాలలో ప్రీమియర్స్ వేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి థియేటర్లు లాక్ చేశారు. చిన్న సినిమాను రెండు రోజుల ముందుగా షోలు వేస్తున్నారంటే మెచ్చుకోతగ్గ విషయమే. కంటెంట్ పై ఎంతో నమ్మకం ఉంటేనే ఇలా చేస్తారు. ఈ మాత్రం ప్రీమియర్స్ టాక్ తేడా కొట్టిన రిలీజ్ రోజు మార్నింగ్ షోకు పట్టుమని పది టికెట్స్ కూడా తెగవు. దానికి ఉదాహారణ ప్రియదర్శి నటించిన చిన్న సినిమా డార్లింగ్. పెయిడ్ ప్రీమియర్స్ లో పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ రోజు మొదటి ఆటకే దుకాణం సర్దేసింది. కమిటీ కుర్రోళ్ళు ఇన్ సైడ్ బాగుందని, కంటెంట్ పై నమ్మకంతోనే ప్రీమియర్స్ వేస్తున్నట్టు ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్.