నటుడు శివాజీ తాజాగా జరిగిన ‘దండోరా’ సినిమా ఈవెంట్లో, హీరోయిన్లు చీరలు కట్టుకు రావాలని, సామాన్లు కనపడే డ్రస్సులు వేసుకు రావద్దంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం వెంటనే వైరల్ అయింది. ఈ ఉదయం నుంచి అనేకమంది సినీ సెలబ్రిటీలు సైతం శివాజీ మాటలను తప్పుపడుతూ తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, శివాజీ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. తన సోషల్ మీడియా అకౌంట్ వేదికగా ఈ వీడియోని షేర్ చేశారు.
Also Read :Shivaji : శివాజీ మైండ్‌సెట్‌పై జాలి పడుతున్నా..!” అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!
శివాజీ మాట్లాడుతూ “ఈ మధ్యకాలంలో కొంతమంది హీరోయిన్లు ఇబ్బంది పడ్డ కారణంగా నాలుగు మంచి మాటలు చెప్పాలని చెప్తూనే, రెండు అన్‌పార్లమెంటరీ వర్డ్స్ (Unparliamentary words) నేను వాడడం జరిగింది. కచ్చితంగా నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే.. నేను మాట్లాడింది అమ్మాయిలందరిని ఉద్దేశించి కాదు. హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే నీకు ఇబ్బంది ఉండదు ఏమో అమ్మ అనే ఉద్దేశం తప్ప, నేను ఎవరిని అవమానపరచాలని కాదు. కానీ, ఏదైనా రెండు అన్‌పార్లమెంటరీ వర్డ్స్ దొర్లాయి, దానికి నా సిన్సియర్ అపాలజీస్ (Sincere apologies).
Also Read :Shivaji : ‘బూతు’ వ్యాఖ్యలపై కమల్ కామరాజు సంచలన కౌంటర్..చూసే కళ్లలోనే ఉంది దరిద్రం..!
అలాగే ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారి లాగానే అనుకుంటాను. ఎందుకంటే, ఈరోజు సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పటం కోసమే, ఆ ఉద్దేశంతోనే ఊరిలో మాట్లాడే భాష మాట్లాడాను. అది చాలా తప్పు, నాకు తెలుసు. నా సిన్సియర్ అపాలజీ. నా ఉద్దేశం మంచిదే కానీ, ఆ రెండు పదాలు దొర్లకుండా ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను.. మంచి చెప్పాలనే ఉద్దేశం తప్ప, అవమానపరచాలి కించపరచాలి అని ఉద్దేశం నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. ఇండస్ట్రీలో ఆడవాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నందుకు, అలాగే మహిళలు ఎవరైనా దీన్ని తప్పుగా అనుకొని ఉంటే.. మీ అందరికీ నా సిన్సియర్ అపాలజీస్ అమ్మ. థాంక్యూ” అంటూ ఆయన సుదీర్ఘంగా ఆ సెల్ఫీ వీడియోలో మాట్లాడారు.
