టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జునపై తెలంగాణ కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి. చిత్ర పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాములమ్మ విజయశాంతి కొండా సురేఖ కామెంట్స్ కు తప్పుపడుతూ కాస్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
రెబల్ స్టార్ ప్రభాస్ : రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత జీవితాలను అగౌరవపరచడం ఆమోదయోగ్యం కాదు, రాజకీయాల కంటే గౌరవానికి ప్రాముఖ్యత నివ్వాలి, లేదంటే సినిమా పరిశ్రమ సహించదు.
కొణిదెల రామ్ చరణ్ : కొండా సురేఖ గారు చేస్తున్న ప్రకటనలు బాధ్యతారాహిత్యమైనవి, నిరాధారమైనవి. గౌరవనీయమైన వ్యక్తుల గురించి అసభ్యకరమైన బహిరంగ వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ పదవిని కలిగి ఉన్న ఎన్నుకోబడిన నాయకుడి నుండి రావడం దిగ్భ్రాంతికరం. ఈ రకమైన అపవాదు మన సమాజపు మూలాధారాలను నాశనం చేయడమే.సినీ వర్గాలు కలిసికట్టుగా ఉండి, మమ్మల్ని ఉద్దేశించి ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను సహించరు. మన వ్యక్తిగత జీవితాలు మనకు పవిత్రమైనవి మరియు తగిన గౌరవానికి అర్హమైనవి. మనం ప్రజాప్రతినిధులం, మనం ఉద్ధరించాలి, ఒకరినొకరు చీల్చకూడదు. అది సినిమా పరిశ్రమ సహించదు
విజయశాంతి : ఏదైనా మాట్లాడే ముందు మనిషి యొక్క రెండో ఆలోచన, విశ్లేషణ. ఆ వ్యక్తికి నిజమైన స్నేహితమని శ్రీ ఏఎన్ఆర్ గారు చెప్పినట్లు చూసాను ఒక ఛానల్‌ల జీవితాన్ని చదివి చూసిన మహోన్నతుల మాటలు ఎన్నటికీ సమాజానికి కూడా సందేశాత్మకాలే. శ్రీ అల్లు రామలింగయ్య గారు మాతో ఎప్పుడూ చెప్పే ఒక్క మాట కూడా ఇక్కడ ప్రస్తావించాలి. మనం మాట్లాడిన మాటకు మనం బానిసలం, మాటలాడని మాటకు మనమే యజమానులం అని.