Site icon NTV Telugu

Tollywood: టాలీవుడ్లో విషాదం.. లేడీ యువ నిర్మాత ఆత్మహత్య.. పురుగులు పట్టేసిన స్థితిలో శవం?

Swetha Varma Suicide

Swetha Varma Suicide

Tollywood Excecutive Producer Swapna Varma Died by Suicide: టాలీవుడ్ లో విషాదం నెలకొంది. మాదాపూర్ లో లేడీ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ ఆత్మహత్య చేసుకుని మరణించింది. అయితే ఆర్థిక కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు. చెబుతున్నారు. మాదాపూర్ కావూరి హిల్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ నివాసం ఉంటోంది. సినీ ఇండస్ట్రీలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా స్వప్న వర్మ పని చేస్తోంది. సొంతూరు రాజమండ్రి నుంచి మూడు సంవత్సరాల క్రితం హైదరాబాద్ సినీ ఇండస్ట్రీలో పని చేయడానికి వచ్చిన స్వప్న గత సంవత్సరం మాదాపూర్ కావూరి హిల్స్ లోని తీగల హౌస్ 101 లో ఒంటరిగానే నివాసం ఉంటోంది.

Chinta Mohan: ఏపీకి త్వరలోనే ప్రత్యేక హోదా వస్తుంది…!

అయితే కొన్ని సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్న ఆమె గత ఆరు నెలలుగా ఏ ప్రాజెక్టు లేకుండా ఖాళీగా ఉంటోంది. రెండు రోజుల క్రితం తన ఫ్లాట్ లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. బాడీ డి కంపోస్ట్ అవ్వడంతో చుట్టుపక్కల వారు దుర్వాసన వస్తోందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు పోలీసులు.. ఇక చుట్టుపక్కల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మాదాపూర్ పోలీసులు..

Exit mobile version