Site icon NTV Telugu

ఫ్యాన్స్ కు టాలీవుడ్ స్టార్స్ ఉగాది శుభాకాంక్షలు

Tollywood Celebrities wishing fans on Ugadi

ఈరోజు ఉగాది పర్వదినం. హిందూ సంప్రదాయం ప్రకారం తెలుగువారికి న్యూ ఇయర్ అన్నమాట. తెలుగువారు ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో ఉగాది కూడా ఒకటి. హిందూ పంచాంగం ప్రకారం ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పర్వదినం జరుపుకుంటారు. ఈరోజు శార్వారీ నామ సంవత్సరానికి వీడ్కోలు పలికి శ్రీ ప్లవ నామ సంవత్సరానికి ఆహ్వానం పలికాము. ఈ రోజున షడ్రుచుల ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణము, మిత్రదర్శనము, ఆర్యపూజనము, గోపూజ, ఏరువాక అనబడే ఆచారాలు పాటిస్తారు. కాగా ఉగాది పర్వదినం సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదితరులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. “తెలుగువారందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అందరికి శుభం సంతోషం కలగాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు మెగాస్టార్.

Exit mobile version