ఈ ఏడాది సంక్రాంతి సందడి ముగిసిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు గడ్డు కాలం నడిచిందనే చెప్పాలి, జనవరి చివరి వారం నుండి మార్చి వరకు విడుదలైన చిన్న, పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. దీంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. లో-ఫుట్‌ఫాల్స్‌తో వెలవెలబోయిన థియేటర్లకు ఇప్పుడు ఏప్రిల్ నెల సరికొత్త ఆశలు చిగురింపజేస్తోంది. ఫిబ్రవరి, మార్చి నెలలు టాలీవుడ్ పంపిణీదారులకు కోలుకోలేని దెబ్బ తీశాయి కానీ, ఏప్రిల్ షెడ్యూల్ చూస్తుంటే మళ్ళీ బాక్సాఫీస్ కళకళలాడటం ఖాయంగా కనిపిస్తోంది. రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ నెలకు పెద్ద దిక్కుగా భావించినప్పటికీ, ఈ సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయనే వార్తలు మెగా అభిమానులను కలవరపెడుతున్నాయి.
ఏప్రిల్ ఫస్ట్ వీక్(3): ఏప్రిల్ రేసును శర్వానంద్ ‘బైకర్’ ప్రారంభించబోతోంది. హై-వోల్టేజ్ రేసింగ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అదే రోజున నిహారిక కొణిదెల నిర్మాణంలో వస్తున్న ‘రాక్షస’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద పండగే!
ఏప్రిల్ సెకండ్ వీక్: (10):
అడవి శేష్ తన పాన్ ఇండియా అడ్వెంచర్ ‘డెకాయిట్’తో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అన్ని ప్రధాన భాషల్లో విడుదలవుతున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో మంచి ఆసక్తి ఉంది. అదే రోజున తమిళ చిత్రం ‘LIK’ కూడా తెలుగులో విడుదల కానుంది.
ఏప్రిల్ థర్డ్ వీక్: (17):
ఈ వారం చిన్న, మీడియం బడ్జెట్ సినిమాల సందడి ఎక్కువగా ఉండబోతోంది. నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’, కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారుతూ వస్తున్న ‘తిమ్మరాజుపల్లి టీవీ’, తిరువీర్ ‘పాపం ప్రతాప్’ సినిమాలతో ఒకే రోజున థియేటర్లలో పోటీ పడనున్నారు.
ఏప్రిల్ చివరి వారాలు: (23 & 30):
ఏప్రిల్ 23న మలయాళ డబ్బింగ్ చిత్రం ‘పేట్రియాట్’ విడుదలవుతుండగా, ఏప్రిల్ 30న అసలైన క్లైమాక్స్ ఉండబోతోంది. ఒకవేళ రామ్ చరణ్ ‘పెద్ది’ వాయిదా పడితే, నిఖిల్ సిద్ధార్థ్ నటించిన విజువల్ వండర్ ‘స్వయంభూ’ ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. అదే రోజున కన్నడ భారీ చిత్రం ‘KD: ది డెవిల్’ కూడా బరిలోకి దిగుతోంది.
