Tollywood : క్యాబ్ డ్రైవర్ని చితకబాదిన ఛత్రపతి సినిమా విలన్

Tollywood (1)

Tollywood (1)

టాలీవుడ్ ప్రముఖ నటుడు సుప్రీత్ (ఛత్రపతి ఫేమ్ కాట్రాజ్)కు సంబంధించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. సుప్రీత్ ఒక క్యాబ్ డ్రైవర్‌పై దాడి చేసి గాయపరిచాడు. ఈ వివాదాస్పద సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. నటుడి ప్రవర్తనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సదరు క్యాబ్ డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీహరి అనే క్యాబ్ డ్రైవర్ ఆదివారం తన ట్రిప్ ముగించుకుని, నెక్ట్స్ మరేదైనా బుకింగ్ అవుతుందేమోనని ఎదురుచూస్తూ నాగారం చౌరస్తాలో తన కారును రోడ్డు పక్కన పార్క్ చేసి ఉంచాడు. సరిగ్గా అదే సమయంలో నటుడు సుప్రీత్ తన కారులో అక్కడికి వచ్చాడు. రోడ్డు పక్కన ఆపి ఉన్న శ్రీహరి క్యాబ్ కారును చూసి, తనకు అడ్డంగా పెట్టావంటూ డ్రైవర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే నటుడు సుప్రీత్ కోపంతో ఊగిపోతూ క్యాబ్ డ్రైవర్ శ్రీహరిని అసభ్య పదజాలంతో దుర్భాషలాడాడు. అంతటితో ఆగకుండా డ్రైవర్‌పై భౌతికంగా దాడి చేసి చితకబాదాడు. ఈ అకస్మాత్తు దాడితో భయాందోళనకు గురైన బాధితుడు వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. అనంతరం కీసర పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నటుడు సుప్రీత్‌పై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

×
×
Ad