పొన్ని సెల్వయిన్ సిరీస్‌తో బౌన్స్ బ్యాక్ అయిన మణిరత్నం.. లాంగ్ గ్యాప్ తర్వాత కమల్ హాసన్‌తో పాన్ ఇండియన్ మూవీ థగ్ లైఫ్ తీసుకు వస్తున్నాడు. ఈ ఏడాది జూన్ ఫస్ట్ వీక్‌లో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా.. ప్రీ రిలీజ్ బిజినెస్ స్టార్ట్ చేసిందని టాక్. ఆ రెండు రాష్ట్రాల డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీగా రాబోతుంది థగ్ లైఫ్. నాయగన్ తర్వాత ఉళగనాయగన్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుండి వస్తున్న చిత్రం కావడంతో ఎవ్రీ ఇండస్ట్రీ ఈగర్లీ వెయిట్ చేస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న థగ్ లైఫ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. పాన్ ఇండియన్ లెవల్లో ఈ ఏడాది జూన 5న థియేటర్లలోకి తీసుకు వస్తున్నారు మేకర్స్.
Saif Ali Khan: సైఫ్ మీద దాడి.. సస్పెన్స్ థ్రిల్లర్ కి తక్కువేం కాదు.. ఈ లాజిక్స్ మిస్సయ్యాయే!
38 ఏళ్ల తర్వాత హిట్ కాంబో టయ్యప్ కావడంతో థగ్ లైఫ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరుగుతుంది. ఓటీటీ హక్కుల రూపంలోనే సుమారు 150 కోట్ల డీల్ సెట్టయ్యినట్లు గట్టిగానే బజ్ నడిచింది. కమల్ నటించిన ఏ సినిమాకు ఈ స్థాయి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదని కోలీవుడ్ టాక్. ఈ సినిమాపై క్రేజ్ అలాంటిది మరీ. కమల్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రొడక్షన్ హౌజ్ రెడ్ జెయింట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శింబు, త్రిష, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్, అభిరామి, నాజర్ కీ రోల్స్ చేస్తున్న థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ అవుతుండగా.. థియేట్రికల్ రిలీజ్ బిజినెస్ స్టార్టైనట్లు ఓ వార్త హల్ చల్ చేస్తుంది. టూ స్టేట్స్ ఈ సినిమాపై కోట్లు కుమ్మరించాయట. ఆంధ్రా రిలీజ్ రైట్స్ రూ. 20 కోట్లు సెట్ అయినట్లు, అలాగే కర్ణాటక థియేటర్ రైట్స్ రూ. 15 కోట్లకు బిజినెస్ జరిగినట్లు తమిళ సినీ సర్కిల్స్‌లో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. డీల్ ఈ లెవల్లో జరుగుతుంటే.. బిగ్ టార్గెట్టే ఫిక్స్ చేసుకున్నట్లు కనిపిస్తోంది.