NTV Telugu Site icon

మహాసముద్రం : స్పెషల్ సాంగ్ కు నో చెప్పిన స్టార్ హీరోయిన్లు…!?

Three Star Heroines rejects ‘Maha Samudram Special Song Offer

యంగ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. సముద్రం నేపథ్యంలో లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిర్మితమవుతున్న ఈ చిత్రంలో సిద్ధార్థ్ కీలకపాత్రలో నటిస్తుండగా… అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ‘మహా సముద్రం’ షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతోంది. ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఏమిటంటే… ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేయడానికి తిరస్కరించారట. ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం మేకర్స్ రకుల్ ప్రీత్, కాజల్, శృతి హసన్ లను సంప్రదించారట. కాని వారిలో ఎవరూ ‘మహాసముద్రం’లో చిందేయడానికీ ఆసక్తి చూపించలేదట. ఈ ద్విభాషా చిత్రాన్ని ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు.