NTV Telugu Site icon

ఆర్ఆర్ఆర్ : ఆ సన్నివేశాలు ప్రేక్షకులను ఏడిపించేస్తాయట…!

NTR and Charan’s special song in RRR

దర్శక ధీరడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజ్ అప్డేట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. జైలులో ఎన్టీఆర్, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేస్తాయట. ఈ సన్నివేశం నేపథ్యంలో కాల భైరవ పాడిన బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ప్రేక్షకులను ఏడిపించేస్తుందట. ఇక ఇప్పటికే ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలకు సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. ఈ చిత్రం కోసం హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ రంగంలోకి దిగారు. సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ తన పనితనంతో అందరినీ మెస్మరైజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా… చరణ్ కు జోడిగా అలియా ‘సీత’ పాత్రలో నటిస్తోంది. ఇక కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తుండగా… ఎన్టీఆర్ కు జోడిగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. అత్యంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, అలిసన్ డూడి, శ్రియ శరన్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. కీరవాణి ‘ఆర్ఆర్ఆర్’కు సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13 న ఈ చిత్రం విడుదల కానుంది.